బాల్కొండ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని కాంక్షిస్తూ ఓ వ్యక్తి చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం బాల్కొండకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మద్దినేని వీరాంజనేయులు భారత్ జోడో యాత్రలో భాగంగా నవంబర్ 23న సైకిల్ యాత్రను ప్రారంభించాడు.
డిసెంబర్ చివరి వరకు ఢిల్లీ చేరి, రాహుల్ గాంధీని కలుసుకొని తన ఆకాంక్షను తెలియజేయనున్నాడు. కార్యకర్తల బలం, దైవ సంకల్పం కలిసొస్తే 2024లో రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటారని ఆయన జోస్యం చెప్పారు.