కాంగ్రెస్ తుఫాన్లో కేసీఆర్ కొట్టుకుపోతాడు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ తుఫాన్ లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.  తెలంగాణలో 24 గంటల కరెంట్.. కేవలం కేసీఆర్ ఇంటికి మాత్రమే పరిమితమైందని చెప్పారు. కేసీఆర్ అవినీతిని ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారు.. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో.. తాను స్వయంగా వెళ్లి చూశానని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణలో కులగణనను జరిపిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలను కాంగ్రెస్ సీఎం అమలు చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతినెలా మహిళల అకౌంట్లో రూ. 2500 వేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కుటుంబపాలన కాదు, ప్రజాప్రభుత్వమని వ్యాఖ్యానించారు.  20 లక్షల మంది రైతులను ధరణి పేరుతో బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. 10 ఏళ్లు తెలంగాణను దోచుకున్నారని... దానికి అంతం పలికే రోజు దగ్గర పడిందని రాహుల్ గాంధీ అన్నారు.