మోదీ పాలనలో ఎంఎస్ఎంఈలు నాశనం రాహుల్ గాంధీ ఫైర్

మోదీ పాలనలో ఎంఎస్ఎంఈలు నాశనం రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)లను కేంద్రం నాశనం చేసిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీ విధానాలతో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్​లో స్టార్టప్స్ ఓనర్లతో రాహుల్ సమావేశమ య్యారు. ఆ టైమ్​లో ఓ స్టార్టప్ ఓనర్ తాను పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఆ వీడియోను రాహుల్ శుక్రవారం ట్వీట్​ చేస్తూ దేశంలోని ఎంట్రపెన్యూర్స్, చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలకు ఇది నిదర్శనమని చెప్పారు.

‘‘ప్రధాని మోదీ గుత్తాధిపత్య విధానాలతో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దూరమయ్యాయి. కేంద్రం ఒక పద్ధతి ప్రకారం ఎంఎస్ఎంఈలపై దాడి చేస్తున్నది. జీఎస్టీ లాంటి నిర్ణయాలతో వాటిని నాశనం చేసింది. నోట్ల రద్దు కారణంగా మన దేశం ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నుంచి వినియోగ ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది” అని అన్నారు.