అధికారంలోకి వస్తే.. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ

అధికారంలోకి వస్తే.. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ

ముంబై: దేశ ప్రజల్లో మతాల పేరిట చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టడంలో బీజేపీ దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ బిజీగా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం (నవంబర్ 12) మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. 

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మహారాష్ట్రలో అధికార మహాయతి కూటమి పాలలో రైతుల కష్టాలు పెరిగాయని.. దేశంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాయతి సర్కార్ ఎన్నడు రైతులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. 

ALSO READ | జార్ఖండ్​ను రోహింగ్యాలకు ధర్మశాలగా మార్చారు

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఎంవీఏ కూటమి గెలిస్తే మహారాష్ట్రలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. సోయా, పత్తి రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు.