
రాహుల్ గాంధీని దేశ ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనవరి 4వ తేదీ గురువారం వైఎస్ షర్మిల ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని వైఎస్సార్ కోరుకున్నారని.. రాహుల్ ప్రధాని అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
షర్మిల వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు దేశప్రజలు అందుకు సుముఖంగా లేరన్నారు. షర్మిలాగానీ, మరెవరో గానీ రాహుల్ ను ప్రధాని చేయలేరని... ఎవరైనా ప్రధానమంత్రి కావాలంటే ప్రజలు చేయాల్సిందేన్నారు. రాహుల్ గాంధీ ఒక పొలిటీషియన్ అని..ఆయన ఫార్ములా ఫెయిల్యూర్ అవుతుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ALSO READ | అప్లికేషన్ల పేరుతో కాంగ్రెస్ టైం పాస్ చేస్తోంది: కిషన్ రెడ్డి