రాహుల్ గాంధీకి ఊరట .. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు

 రాహుల్ గాంధీకి ఊరట ..  పరువు నష్టం కేసులో  బెయిల్ మంజూరు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.  బీజేపీ పెట్టిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టు ఆయనకు  బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  2019-2023 పాలనలో కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని రాహుల్ ఆరోపణలు చేశారు.  

దీంతో రాహుల్ ఆసత్యల ప్రచారలు చేశారంటూ ఆ పార్టీ  నేతలు  బసవరాజ్ బొమ్మై  సహా పలువురు రాహుల్ పై  పరువు నష్టం పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై 2024 జూన్ 07వ తేదీన విచారణ చేపట్టిన బెంగళూరు కోర్టు రాహుల్ గాంధీకి  బెయిల్ మంజూరు చేసింది.  ఈ కేసు తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.  కాగా ఇదే  కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కోర్టు జూన్ 1న బెయిల్ మంజూరు చేసింది.  

మే 2023లో జరిగిన  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో224 సీట్లలో 135 స్థానాలను కైవసం చేసుకుని  కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 66 సీట్లు సాధించగా, జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు గెలుచుకుంది.