
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్లా లీడ్ లో ఉన్నారు. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. రాయ్ బరేలి, వయనాడ్ రెండు చోట్లు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ముందంజలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కు కొంచెం భిన్నంగా ఫలితాలు వస్తున్నారు. ఎన్డీయే కూటమికి 300 సీట్లు వస్తాయి అని చెప్పగా.. రిజల్ట్స్ లో మాత్రం ఇండియా కూటమి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇస్తోంది.
2019లోక్ సభ ఎన్నికల్లో కూడా ఈయన రెండు స్థానాల్లో పోటీ చేశారు. వయనాడ్, అమేథీ నుంచి బరిలో దిగగా.. అమేథీలో స్ముతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. వయనాడ్ లో విజయం సాధించాడు.