న్యూఢిల్లీ: మోడీ సర్కారుపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. యువతకు ఉద్యోగం ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. భారత్ కు అసత్య వాగ్దానాలు మిగిలాయని.. జాబ్స్ చైనాకు దక్కాయని రాహుల్ ట్వీట్ చేశారు. దేశంలోని అవ్యవస్థీకృత రంగాన్ని మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవ్యవస్థీకృత రంగంతోపాటు ఎంఎస్ఎంఈలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. దీని వల్ల ‘మేకిన్ ఇండియా’ కాస్తా ‘బై ఫ్రమ్ చైనా’ (చైనా నుంచి కొనుగోళ్లు)గా మారిందన్నారు.
JUMLA for India
— Rahul Gandhi (@RahulGandhi) February 4, 2022
JOBS for China!
Modi Government has destroyed the Unorganised Sector and MSMEs that create the most jobs.
Result: 'Make In India' is now 'Buy from China' pic.twitter.com/nZRUsYxgkP
మోడీ మేకిన్ ఇండియా వాగ్దానం చేశారని.. కానీ దాన్ని నిలబెట్టుకోవడం విఫలం అయ్యారని రాహుల్ విమర్శించారు. మన్మోహన్ హయాంలోని యూపీఏ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు మోడీ సర్కారు పవర్ లో చైనా నుంచి దిగుమతులు విపరీతంగా పెరిగాయన్నారు. గతేడాది ఈ దిగుమతుల శాతం 46కు పెరిగిందన్నారు. మోడీ హయాంలో నిరుద్యోగికత అన్ని రికార్డులను అధిగమించిందని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం: