
న్యూఢిల్లీ: యమునా నది కాలుష్యానికి ఆప్ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గురువారం యమునా నదిలో ఆయన బోటులో ప్రయాణించారు. ఈ సందర్భం గా పడవ నడిపేవారు, స్థానికులు, పరిశోధకులతో మాట్లాడిన వీడియోను రిలీజ్ చేశారు. ‘‘యమునా నదిలో స్నానం చేస్తానని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఐదేండ్ల క్రితం హామీ ఇచ్చారు. మరి ఏమైంది? నది పూర్తిగా కలుషితమైంది. నది ప్రక్షాళన కోసం ఆప్ సర్కారు ఏమీ చేయలేదు. ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎగువ నుంచి విష వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని, వాటిని అడ్డుకోవడానికి ఆప్ సర్కారు ఏమీ చేయడం లేదు” అని రాహుల్ అన్నారు.