దేశసంపద సమానంగా పంచాలంటే..దేశం మొత్తం కులగణన సర్వే చాలా కీలకం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. హైదరాబాద్ లోని గాంధీ ఐడి యాలజీ సెంటర్ లో కులగణనపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్..కులగణన సర్వే ఎందుకు కీలకమో వివరించారు. తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం అన్నారు. కులగణన చేస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని అభినందించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సి ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశంలో కుల వివక్ష కొనసాగుతుందని.. కులం విషయంలో ఓ విజన్ తో ముందుకు వెళ్లా ల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మతాలపై మని విజన్ తో వెళ్లడం తప్పనిసరి అన్నారు రాహుల్ గాంధీ.
దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నానని ప్రధాని మోదీ అంటున్నారు.. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కుల గణన సర్వే ద్వారా కులాల లెక్క తెల్చవచ్చు.. దేశవ్యాప్తంగా కులగణనపై పార్లమెంట్ చర్చపెట్టింది తానేనని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read : అమీన్‌పూర్‌లో హైడ్రా సర్వే
ఏ వ్యవస్థలో ఏ వర్గం ఎందుందో కనుక్కోవాలి.. నిజం బయటకు రావొద్దనే కొందరు కులగణనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అగ్ర కులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ కనిపించదు.. రాజకీయ, న్యాయవ్యవస్థలో కూడా కులవివక్ష ఉందన్నారు.కార్పొరేట్ కంపెనీల్లో ఎంతమంది దళితులు పనిచేస్తున్నారో తెలుసా..కులగణనకు మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామన్నారు రాహుల్ గాంధీ.