సమాజంలో కులవివక్ష బలంగా ఉంది: రాహుల్ గాంధీ

సమాజంలో కులవివక్ష బలంగా ఉంది: రాహుల్ గాంధీ


హైదరాబాద్:  దేశంలో కులవివక్ష చాలా బలంగా నాటుకు పోయింది. కుల వివక్ష అనుభవించే వారికి ఆ బాధంటే తెలుస్తుందన్నారు రాహుల్ గాంధీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ అని టైటానిక్ ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు.. కానీ సముద్రం అడుగున దాగి ఉన్న ఓ  మంచుకొండను ఢీకొని మునిగిపోయింది..కేవలం పది శాతం ఉన్న మంచు అంతపెద్ద టైటానిక్ ఓడను నీట ముంచిందన్నారు. అలాగే ప్రస్తుత భారత్ లొో కుల వివక్ష కూడా బయటికి కనిపించకుండా ఉంది. దేశాన్ని ఎప్పుడు ముంచుతుందో తెలియదని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. మన దేశంలో కులవివక్ష వ్యాధికి పరీక్షలు చేయాల్సి ఉంది. అందుకే కులగణన ఎక్స్ రే అవసరమన్నారు రాహుల్ గాంధీ. 

దేశ వ్యాప్తంగా కులగణన జరగాల్సి ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశంలో కుల వివక్ష కొనసాగుతుందని.. కులం విషయంలో ఓ విజన్ తో ముందుకు వెళ్లా్ల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మతాలపై మని విజన్ తో వెళ్లడం తప్పనిసరి అన్నారు రాహుల్ గాంధీ. 
అసమానతలకు కేరాఫ్ అడ్రస్ మన దేశం అన్నారు రాహుల్ గాంధీ. దేశంలో అసమానతలకు ప్రధాన కారణం కుల వివక్ష అన్నారు. మన దేశంలో ఇంకా ఒక దళితుడుని అంటరానివానివాడిగా చూస్తూ ముట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఈ రకమైన వర్గ ప్రపంచ ఎక్కడా చూడలేదన్నారు. 

Also Read : అసమానతలకు కేరాఫ్ అడ్రస్ మన దేశం


కార్పొరేట్ సంస్థలలో ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ ఎస్టీలు, బీసీ పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఆదివాసీలు మీడియా రంగం ఎంతమంది ఉన్నారని పదేపదే ప్రధాని మోదీని ప్రశ్నిస్తే.. దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాహుల్ అన్నారు. 

కుల గణనతో దేశంలో ఒక మంచి పరిపాలన అందించేందుకు అవకాశం ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశసంపద సమానంగా పంచాలంటే.. దేశం మొత్తం కులగణన సర్వే చాలా కీలకం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. హైదరాబాద్ లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. కులగణన సర్వే ఎందుకు కీలకమో వివరించారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శం అన్నారు. కులగణన చేస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని అభినందించారు.