ఒడిషాలో BJP, BJD రెండూ ఒక్కటేనన్నారు రాహుల్ గాంధీ. బాలసోర్ లో మాట్లాడిన రాహుల్....ఒడిషాలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగా ణలో ఒక్కటిగా ఉన్న BJP, BRS ను ఓడించి...ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. KCR..బీజేపీ కోసం పనిచేసేవారని ఆరోపించారు. BJP, BRS కు వ్యతిరేకంగా నిలబ డి..పోరాడి తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు రాహుల్. ఒడిషాలోనూ ఒక్కటిగా ఉన్న BJP, BJDని ఓడించి... ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు రాహుల్ గాంధీ.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఒక్కటయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భూమిప ఉన్న ఏ శక్తి రాజ్యాంగాన్ని నాశం చేయలేదు.మీరు శక్తులన్నింటికి ఉపయోగించినా రాజ్యాంగాన్ని తాకలేరని బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు.