
పాతతరం రాజకీయం అంతరించిపోయింది.ఇప్పుడంతా యంగ్ అండ్ న్యూ పాలిటిక్స్ నడుస్తున్నాయి..యువత రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. శనివారం (ఏప్రిల్ 26) నోవాటెల్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, దేశం, ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకున్న ప్రేమ, ప్రజలకు ఏం చేయాలని పార్టీ అనుకుంటుందో వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. గడిచిన పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. ప్రభుత్వ పాలసీలపై లోతుగా చర్చించాల్సి ఉందన్నారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్నారు. విపక్షాలు తమ గొంతు వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు రాహుల్ గాంధీ.
పాతతరం రాజకీయం అంతరించి పోయింది. ఇప్పుడంతా యంగ్ అండ్ న్యూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాజకీయాల్లోకి కొత్త తరం(యువత ) రావాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ.
►ALSO READ | Bharat Summit 2025: దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం: భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర మొదట్లో నాతో కొద్ది మంది మాత్రమే ఉన్నారు.. రోజులు గడుస్తున్న కొద్దీ నాతో వేలాది మంది నడిచారన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నించాను సక్సెస్ అయ్యాను అన్నారు. మేం దేశ ప్రజలకు ప్రేమను పంచేందుకు పాదయాత్రను మొదలు పెట్టాం.. ‘‘విద్వేశాల బజారులో ప్రేమ దుకాణం తెరిచామన్నారు’’ రాహుల్ గాంధీ.
దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు.. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయాలు కూడా ప్రజల ఇష్టానుసారంగానే ఉండాలన్నారు.