తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్:రాహుల్గాంధీ

తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్:రాహుల్గాంధీ
  • అణగారిన వర్గాలకోసమే మా పోరాటం:రాహుల్ గాంధీ 
  •  కులగణన అంటే మోదీ ఎందుకు భయం 
  • తెలంగాణలో 90 శాతం అణగారివర్గాలే 
  • కులగణనకు కట్టుబడి ఉన్నాం 
  • ఎవరు ఎంతున్నారో తేలాల్సిందే 
  • కులగణనకు మోదీ, ఆర్ ఎస్ ఎస్ వ్యతిరేకం 
  • 99శాతం అణగారిన వర్గాల్లో CEOలు, వ్యాపారులు ఒక్కరూ లేరు 
  • తెలంగాణలో కులగణన తేల్చాం 
  • తెలంగాణలో కులగణన ప్రజల పరిస్తితిని అంచనా వేసింది 
  • చిన్న చిన్న పనులతోనే 90 శాతం ప్రజలు బతుతుకున్నారు 
  • కులగణనతోనే ప్రజలకు ప్రభుత్వ సాయం 
  • తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు 

అణగారిన వర్గాలకోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా కులగణనకు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కులగణన చేపట్టాం..  తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్ అన్నారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా కులగణను చేపట్టాలని పార్లమెంట్ లో ప్రధాని మోదీ సమక్షంలో లేవనెత్తాం..కులగణనకు మోదీ, ఆర్ ఎస్ ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. కులగణన అంటే మోదీకి ఎందుకు అంత భయం అని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తేలితేగానీ అణగారిన వర్గాలకు  ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతాయని రాహుల్ గాంధీ అన్నారు.

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టింది. కులగణన తెలంగాణ ప్రజల పరిస్థితిని అంచనా వేసింది. చిన్న చిన్న పనులతోనే 90 శాతం మంది ప్రజలు బతుకుతున్నారు. 99శాతం అణగారిన వర్గాల్లో ఒక్కరూ కూడా CEOలు, వ్యాపారులు లేరని అన్నారు. కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కులగణనతో ప్రజలకు ప్రభుత్వ సాయం అందుతుందన్నారు రాహుల్ గాంధీ. 

ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతీ వ్యవస్థపై మోదీ టీం దాడి చేస్తోందన్నారు. మోదీ 24 గంటలు దళితులు, ఆదీవాసీలు, ఓబీసీల గురించి మాట్లాడుతారు.. కానీ చేసిందేమీ లేదన్నారు. అదానీ , అంబానీ కంపెనీల్లో పెద్ద పోస్టుల్లో ఒక్క దళితుడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు. దేశంలో ప్రముఖ కంపెనీలన్నీ అదానీవే.. మోదీ మిత్రులకే దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు. 

ట్రంప్ తన స్నేహితుడు అని చెప్పుకుంటున్న మోదీకి.. టారీఫ్ లతో భారత్ పై దాడి చేస్తున్నా చూస్తూ కూర్చున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. 26 శాతం సుంకాలు విధించినా మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. ట్రంప్ సుంకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీరని నష్టంఅన్నారు రాహుల్ గాంధీ. 

ఇక మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎలా గెలిచిందో మహారాష్ట్ర ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర ఓటర్ లిస్ట్ ఇవ్వమని ఈసీని కోరితే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ఖూని చేసిందన్నారు.