
ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతీ వ్యవస్థపై మోదీ టీం దాడి చేస్తోందన్నారు. మోదీ 24 గంటలు దళితులు, ఆదీవాసీలు, ఓబీసీల గురించి మాట్లాడుతారు..కానీ చేసిందేమీ లేదన్నారు. అదానీ , అంబానీ కంపెనీల్లో పెద్ద పోస్టుల్లో ఒక్క దళితుడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు. దేశంలో ప్రముఖ కంపెనీలన్నీ అదానీవే.. మోదీ మిత్రులకే దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు.
ట్రంప్ తన స్నేహితుడు అని చెప్పుకుంటున్న మోదీకి.. టారీఫ్ లతో భారత్ పై దాడి చేస్తున్నా చూస్తూ కూర్చున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. 26 శాతం సుంకాలు విధించినా మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. ట్రంప్ సుంకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీరని నష్టంఅన్నారు రాహుల్ గాంధీ.
ఇక మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎలా గెలిచిందో మహారాష్ట్ర ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర ఓటర్ లిస్ట్ ఇవ్వమని ఈసీని కోరితే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ఖూని చేసిందన్నారు.
►ALSO READ | తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్:రాహుల్గాంధీ