అధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ

అధికారంలో వస్తే జీఎస్టీ  తొలగిస్తాం:రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ విధించి చిన్న వ్యాపారులను దారణంగా దెబ్బతీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చిన్ని పరిశ్రమలను అన్నీ మూసి వేయించారు. మేం అధికారంలోకి రాగానే చిన్న వ్యాపారుల కోసం బ్యాంకు దర్వాజాలను ఓపెన్ చేస్తామన్నారు. జీఎస్టీని మార్చి..ఐదు వేర్వేరు ట్యాక్సీలు ఉండవు..ఒకే పన్ను విధానం తీసుకొస్తామన్నారు. 

మహిళలు, యువత అకౌంట్లో ఏడాది లక్ష రూపాయల చొప్పున వేస్తామన్నారు రాహుల్ గాంధీ. నెలకు రూ. 8500 చొప్పున 12 నెలలపాటు ఏడాది మొత్తం ఈ డబ్బులు లబ్దిదారుని ఖాతాలో వేస్తామన్నారు. పేదవాడి చేతిలో డబ్బు ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా భారత దేశంలో పరిశ్రమల అభివృద్ది జరుగుతుందన్నారు. పరిశ్రమలు పెరిగితే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 

అగ్నివీర్ రిక్రూట్మెంట్ను కూడా రద్దు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఒక సైనికుడి పెన్షన్ వస్తుంది..మరొ సైనికుడి పెన్షన్ రాదు..ఈ విధానాన్ని మేం పూర్తిగా వ్యతి రేకిస్తున్నామన్నారు రాహుల్ గాంధీ.