సామాజిక న్యాయం కోసం..వైట్ టీషర్ట్ ఉద్యమం: రాహుల్ గాంధీ

సామాజిక న్యాయం కోసం..వైట్ టీషర్ట్ ఉద్యమం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పేదలు, శ్రామిక వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిస్తూ కాంగ్రెస్  ఎంపీ రాహుల్  గాంధీ ఆదివారం ఢిల్లీలో ‘వైట్ టీషర్ట్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా రాహుల్  మాట్లాడుతూ.. పేదలు, సామాన్యులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రంలోని మోదీ సర్కారు మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. తాను ఎంచుకున్న కొంతమంది పెట్టుబడిదారుల కోసమే మోదీ సర్కారు పనిచేస్తున్నదని విమర్శించారు. 

ALSO READ : ప్రధాని మన్ కీ బాత్.. మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

ఇలాంటి సమయంలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కృషి చేయాలని యువతకు ‘ఎక్స్’ లో ఆయన సూచించారు.