యూరప్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు బయలుదేరారు.  వారం రోజుల యూరప్ పర్యటనలో రాహుల్ యూరోపియన్ యూనియన్ లాయర్లు, విద్యార్థులు, భారతీయ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు.  2023 సెప్టెంబర్ 07 గురువారం రోజున బ్రెజిల్, హేగ్ లలో లాయర్లతో  భేటీ కానున్నారు.  

Also Read : ప్రధాని మోదీ ఎస్​పీజీ డైరెక్టర్​ మృతి

ఇక సెప్టెంబర్ 08న పారిస్ లో విద్యార్థులతో రాహుల్ భేటీ అవుతారు.  అక్కడి ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.   సెప్టెంబర్ 10న ఓస్లోలో జరిగే డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొంటారు.  G20 సమ్మిట్ ముగిసిన ఒక రోజు తర్వాత  అంటే సెప్టెంబర్ 11న  తిరిగి ఇండియాకు చేరుకుంటారు.  

సెప్టెంబర్ 9-, 10 తేదీలలో భారత్ G20 లీడర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా ప్రపంచ నేతలు వస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరిగే జీ20 సదస్సుకు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.