గల్ఫ్ బాధిత కార్మికుల గోసను పట్టించుకోకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీ

జగిత్యాల జిల్లా కోరుట్లలో తమ సమస్యలను పరిష్కరించాలని గల్ఫ్ బాధిత కార్మికులు రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ లంచ్ చేసే సమయంలో ఆయన్ని కలిసేందుకు.. గల్ఫ్ లో అకాల మరణాలు, అక్కడ తెలంగాణ వాసులు పడుతున్న కష్టాలను వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ఫ్లెక్సీల రూపంలో తయారుచేసి.. ఆ ఫ్లెక్సీలను పట్టుకొని రాహుల్ గాంధీకి కనబడేలా గల్ఫ్ బాధిత కార్మికులు నిలబడ్డారు.

ALSO READ: బీఆర్ఎస్లో చేరిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ. 500 కోట్లతో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని అడిగేందుకు బాధితులు కలవాలని అనుకున్నారు. కానీ తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే రాహుల్ గాంధీ పట్టించుకోకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోయారని గల్ఫ్ కార్మికులు నిరాశతో వెనుదిరిగారు.