
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైల్వే కూలీ అవతారమెత్తాడు. ఎరుపు చొక్క ధరించి రైల్వే కూలీలతో కలిసి తలపై లగేజీ మోశాడు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో రైల్వే కూలీలతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా రైల్వే పోర్టర్లతో లగేజీ మోశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ : అదృష్టం ఇలా ఉండాలి : రాత్రికి రాత్రి రూ.25 కోట్లు వచ్చాయి..
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ.. యాత్రలో మెకానిక్ లను విద్యార్థుల వరకు అన్ని వర్గాలను కలిశారు. ఇటీవల లద్దాఖ్ లో సామాజిక వర్గాలతో మమేకమయ్యారు.