
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి అమెరికాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 19న ఆయన అమెరికాకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంగా బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అలాగే, బోస్టన్‌లోని ఎన్నారైతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ ఎన్ని రోజులు అమెరికాలో పర్యటిస్తారన్న వివరాలు తెలియరాలేదు.
అమెరికా పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు రాహుల్ అమెరికా టూర్‌పై చర్చించుకుంటున్నారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో రాహుల్ మూడ్రోజుల పాటు పర్యటించారు. ఆ సమయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఇండియాలో రిజర్వేషన్లు, మత స్వేచ్ఛ తదితర అంశాలపై మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు.