కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి మహిళా సదస్సులో జరిగిన సదస్సులో రాహుల్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కించి... మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు రాహుల్ గాంధీ.
కేసీఆర్ రాష్ట్ర సంపదనను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పులభారాన్ని మోపారని విమర్శించారు రాహుల్ గాంధీ. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ,బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తాయని చెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరు.
Aslo Read :- మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ. 2500 అందిస్తామన్నారు. మోదీ, కేసీఆర్ హయాంలో సిలిండర్ ధర రూ. 1200లకు చేరిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500లకే సిలిండర్ అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
మహిళ సదస్సు తర్వాత రాహుల్ గాంధీ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాహుల్ వెంట రేవంత్, భట్టి, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఉన్నారు. రాహుల్ తో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతించారు పోలీసులు.