మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్, మల్లికార్జున్ ఖర్గే నివాళి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్, మల్లికార్జున్ ఖర్గే నివాళి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు.  గురువారం ( అక్టోబర్ 31) ఉదయం ఢిల్లీలో శక్తిస్థల్ లో ఆమె శక్తి స్థల్ వద్ద ఇందిరాగాంధీ మెమోరియల్ సంరద్శించిన రాహుల్ ఆమె నివాళుర్పించారు. జాతి ఐక్యత,  సమగ్రత కోసం తన నాయనమ్మ ఇందిరాగాంధీ చేసిన త్యాగం స్పూర్తినిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. 

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళుర్పించారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటంలో , నిర్మించడంలో తన దృఢ సంకల్పం, సమర్థవంతమైన నాయకత్వం, దూరదృష్టి గత మాజీ ప్రధాని ఇందిర మాకు ఆదర్శమన్నారు. 

దేశానికి ఏకైక మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ పనిచేశారు. 1977 నుంచి 1984 వరకు ప్రధానిగా ప్రజలకు సేవ చేశారు. 1977 అక్టోబర్ 31న ఆమె నివాసంలో ఇద్దరు అంగరక్షకులు కాల్చి చంపారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు దారితీసింది.