న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రియాంక గాంధీ శుక్రవారం చేసిన తొలి ప్రసంగంపై ఆమె అన్న, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ఎంపీగా తన తొలి స్పీచ్ కంటే ప్రియాంక స్పీచ్ బెటర్ గా ఉందన్నారు.
ప్రియాంకా గాంధీ వయనాడ్ ఉప ఎన్నికలో గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. శుక్రవారం పార్లమెంటులో రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆమె మొదటిసారి మాట్లాడారు. లోక్ సభ సమావేశాల అనంతరం పార్లమెంట్ బయట రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రియాంక అద్భుతంగా ప్రసంగించారు.. ఎంపీగా లోక్ సభలో నేను ఇచ్చిన తొలి స్పీచ్ కంటే ప్రియాంక స్పీచ్ చాలా బెటర్’ అని మెచ్చుకున్నారు.