నా హృదయంలో వయనాడ్కు ప్రత్యేక స్థానం: రాహుల్ గాంధీ

నా హృదయంలో వయనాడ్కు ప్రత్యేక స్థానం: రాహుల్ గాంధీ

తిరువనంతపురం: తన హృదయంలో వయనాడ్ కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ వయనాడ్ లోని సుల్తాన్ బతేరిలో తన చెల్లెలి కోసం ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ప్రియాంక గాంధీ ఎంపీ అభ్యర్థి. ఆమె నా చెల్లెలు కూడా. ఆమె గురించి వాయనాడ్ ప్రజలకు చెప్పే హక్కు నాకు ఉంది. వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. వారికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడి వారు ఎప్పుడైనా నన్ను కలవచ్చు. వారి పనులను నేను సంతోషంగా చేస్తాను” అని రాహుల్ అన్నారు. వయనాడ్ ను అగ్రస్థాయి పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, అందువల్ల ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందన్నారు. కాగా వయనాడ్ ఉపఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఎల్లుండి ఇక్కడ పోలింగ్ జరగనుంది.

ALSO READ | Air Pollution: ఢిల్లీలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధించాలి: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం