కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖమ్మం సభకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఖమ్మం సభకు చేరుకున్నారు.
అంతకుముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం తెలిపారు. శాలువాలతో సన్మానించారు. ఆ తర్వాత స్పెషల్ హెలికాప్టర్ వరకు నడుచుకుంటూ వెళ్లి హెలికాప్టర్ ఎక్కారు. అక్కడి నుంచి ఖమ్మం జనగర్జన సభకు బయలుదేరారు.