గుత్తాధిపత్యానికి నేను వ్యతిరేకం..వ్యాపారానికి కాదు: రాహుల్ గాంధీ

గుత్తాధిపత్యానికి నేను వ్యతిరేకం..వ్యాపారానికి కాదు: రాహుల్ గాంధీ

పెద్ద పెద్ద వ్యాపారాలకు తాను వ్యతిరేకం అని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని.. గుత్తాధిపత్యానికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. 

ముంబైలో జరిగిన మహారాష్ట్ర స్వాభిమాన్ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అసలు ఈస్టిండియా కంపెనీ 150 యేళ్ల క్రితమే పతనమైంది.. అయితే దాని స్థానంలో కొత్త జాతి గుత్తాధిపత్యం వస్తుందని ఓ వార్తా పత్రికకుఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.  

ప్రధాని  మోదీ గురించి, ఆయన ప్రభుత్వం గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలని సీనియర్ మంత్రి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని.. చాలా ప్లే ఫెయిర్ బిజినెస్ లు చెబుతున్నాయని రాహుల్ చెప్పారు. ఇదే నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా రుజువు చేస్తుందని Xలో రాశారు. మోదీ ప్రభుత్వం బడా వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా అదానీ గ్రూప్ కు లబ్ధి చేస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. 

Also Read : ఒక్క మసీదుపైనా లౌడ్ స్పీకర్ లేకుండా చేస్తాం

‘‘నేను  ఉద్యోగాలకు, వ్యాపారానికి , ఆవిష్కరణలకు , పోటీతత్వానికి సపోర్టు చేస్తాను. అయితే గుత్తాధిపత్యానికి మాత్రం వ్యతిరేకిని, అందరికీ స్వేచ్ఛగా వ్యాపార రంగం ఉన్నపుడు ఆర్థిక వ్యవస్త అభివృద్ధి చెందుతుందని ’’ రాహుల్ తన X పోస్ట్ లో రాశారు.