పేదలను దోచుకునే వ్యవస్థే జీఎస్టీ : రాహుల్ గాంధీ

పేదలను దోచుకునే వ్యవస్థే జీఎస్టీ : రాహుల్ గాంధీ

తక్కువ ఆదాయం వర్గాల ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపే వ్యవస్తే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్‌లోని  ధన్‌బాద్‌ ప్రాంతం బగ్మారాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల వారు వెనకబాటుకు గురైతున్నారని, ఆర్థిక మరియు సామాజిక అసమానతలను పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ ప్రతిజ్ఙ చేశారు. 

గాంధీ ప్రస్తావించిన మరో ప్రముఖ సమస్య ఏమిటంటే కుల ఆధారిత రిజర్వేషన్లపై ప్రస్తుతమున్న పరిమితి. 50% రిజర్వేషన్ల పరిమితిని తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, ఈ విధానం ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీలలో సామాజిక చైతన్యానికి గల అవకాశాలను పరిమితం చేసిందని ఆయన హామీ ఇచ్చారు. "మేము ఏ ధరకైనా రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తాము," అని ఆయన ప్రకటించారు, విద్య, ఉద్యోగాలు మరియు ప్రభుత్వ సంస్థల్లో న్యాయమైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి రిజర్వేషన్ కోటాలను పెంచడం చాలా అవసరమని నొక్కి చెప్పారు.

భారతదేశంలోని జనాభాలో దాదాపు 90శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ సంస్థల్లో, ఉద్యోగాల్లో వారు కనిపించడం లేదని ఆయన తెలిపారు. పేదల్లో 8 శాతం గిరిజనులు, 15 శాతం దళితులు, 50 శాతం వెనుకబడిన తరగతులకు చెందినవారు, 15 శాతం మైనారిటీలు ఉన్నారని వివరించారు రాహుల్ గాంధీ. GST విధానం పేదలను ఆర్థిక అసమానతలకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇండియాలో ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను విధానం ధనికులకు మేలు చేస్తోందని అన్నారు. బీజేపీ సమ్మిళిత వృద్ధికి పాల్పడకుండా ఆర్థిక విభజన చేస్తుందని రాహుల్ చెప్పారు. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు చేసిన రుణమాఫీ.. అంతే మొత్తంలో పేదప్రజలకు ఎందుకు చేయాలనేదని ఆయన ప్రశ్నించారు. 

Also Read : MVA అంటే అవినీతి, కుంభకోణాలు

ఆర్థిక అసమానతలకు సంబంధించి మోదీ పరిపాలన విధానాలను గాంధీ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రుణమాఫీకి సమానమైన నిధులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇండియాలో పారిశ్రామిక వేత్తలు.. వారి ఆర్థిక సహాయానికి పేద ప్రజలనే టార్గెట్ గా చేసుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ అట్టడుగు వర్గాల కంటే కార్పొరేట్ కుబేరులకే మొగ్గు చూపుతుందని వ్యాఖ్యానించారు.