మేకిన్ ఇండియాతో ఒరిగిందేం లేదు..మోదీ పూర్తిగా విఫలం

మేకిన్ ఇండియాతో ఒరిగిందేం లేదు..మోదీ పూర్తిగా విఫలం

 మేకిన్ ఇండియాలో ప్రధాని మోదీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ  అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్ సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన మోదీ.. 
 రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలేమీ లేవన్నారు.  మేకిన్ ఇండియా వల్ల దేశంలో  ఎలాంటి మార్పు జరగలేదన్నారు.  ప్రధాని మోదీ మేకిన్ ఇండియా మంచి ఆలోచనే కానీ..విఫలమయ్యారని విమర్శించారు.  నిరుద్యోగ సమస్య నుంచి దేశం బయటపడలేదన్నారు.యూపీఏ కానీ, ఎన్డీయే ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని తెలిపారు. 

 దేశంలో ఎలక్ట్రానికి పరికరం తయారీలో పూర్తిగా వెనకబడ్డామని తెలిపారు. ఫోన్ లు ఇక్కడే తయారవుతున్నాయి కానీ మేడిన్ ఇండియా కాదన్నారు. దేశంలో  పూర్తిగా తయారీ రంగాన్ని వినియోగించుకోవడం లేదని చెప్పారు.  చైనా నుంచి దిగుమతులపై ఆధారపడ్డామని తెలిపారు. ఫోన్లు,ధరించే టీషర్ట్స్ ఇలా ప్రతీది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 2014లో GDPలో తయారీ 15.3 శాతం ఉంటే ఇవాళ  12.6 శాతానికి పడిపోయిందన్నారు.  60 ఏళ్ల కనిష్టానికి జీడీపీ పడిపోయిందన్నారు రాహుల్. 

ALSO READ | దురదృష్టకర ఘటన.. కుంభమేళా తొక్కిసలాట పిటిషన్‎పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

 దేశంలో  కులగణణ ఎందుకు చేయడం లేదు. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యాం.  దేశంలో ఉత్పత్తులను చైనాకు అప్పగించారు.
దేశంలో సామాజిక అశాంతి పెరిగింది.  దేశంలో సగానికి పైగా మంది బీసీలే. సాఫ్ట్ వేర్ విప్లవం గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఏఐ లో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుంది.   తెలంగాణలో 90 శాతం మంది వెనుబడిన వాళ్లే అని రాహుల్ అన్నారు.