దేశంలో కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. లోక్ సభలో మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని తెలిపారు. తెలంగాణలో 90 శాతం మంది వెనుబడిన వాళ్లే ఉన్నారని రాహుల్ చెప్పారు. కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దేశంలో సగానికి పైగా మంది బీసీలే ఉన్నారని తెలిపారు.
ALSO READ | మేకిన్ ఇండియాతో ఒరిగిందేం లేదు..మోదీ పూర్తిగా విఫలం
మేకిన్ ఇండియాలో ప్రధాని మోదీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్ సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన మోదీ..
రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలేమీ లేవన్నారు. మేకిన్ ఇండియా వల్ల దేశంలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా మంచి ఆలోచనే కానీ..విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ సమస్య నుంచి దేశం బయటపడలేదన్నారు.యూపీఏ కానీ, ఎన్డీయే ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని తెలిపారు రాహుల్. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.