తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ. శాంతి భద్రతలను బీజేపీ సర్కార్ నాశనం చేస్తుందన్న రాహుల్.. వ్యవస్థలో తన సొంతవ్యక్తులను చేర్చేందుకే ఇదంతా చేస్తోందని విమర్శించారు. గుజరాత్ తాపి జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేపర్ల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకొస్తుందన్నారు ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. గుజరాత్ లో గత ఐదేళ్లలో 22కు పైగా పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. బీజేపీ సర్కార్ శాంతిభద్రతలను నాశనం చేసిందని ఆరోపించారు.
ALSO READ :- గంజాయి మత్తులో ఘర్షణ.. యువకుడికి కత్తిపోట్లు
గుజరాత్ తాపి జిల్లాలోని వ్యారాలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బార్డోలీలో స్వరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన రాహుల్.. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రతకు వల్లభ్ భాయ్ పటేల్ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు రాహుల్.