కేసీఆర్పై కేసులెందుకు పెట్టలేదు?: రాహుల్గాంధీ

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ రూ. లక్ష కోట్ల అవినీతి జరిగింది
  •  తెలంగాణ ఆదాయమంతా కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంటోంది
  •  ఇంత దోపిడీ జరుగుతున్నా కేంద్రం ఏం చేస్తున్నట్లు? 
  •  పదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందేంటి?
  •  ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ

ప్రధానిమోదీ నాపై 24 కేసులు పెట్టారు. నా ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్ నుంచి పంపించి వేశారు. అవినీతిపరుడైన కేసీఆర్పై మాత్రం ఒక్క కేసు కూడా లేదు’ అని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా అందోలులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగింది. తెలంగాణ ఆదాయమంతటినీ కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుం టోంది. ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా వారి చేతిలోనే ఉంది. కేసీఆర్ దోపిడీ వల్లే మే డిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ధరణి పోర్టల్ ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుం జుకున్నరు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వల్ల ఎంతో మంది యువత నష్టపోయారు.

బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. మీరు చదువుకున్న స్కూళ్లు, కాలేజీలు కాంగ్రెస్ ఏర్పాటు చేసినవే.. హైద రాబాద్ ను ఆధునాత నంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఈ పదేండ్లలో బీఆర్ఎస్ఏం చేసిందో కేసీఆర్ చెప్తారా? దొరల సర్కారు, ప్రజల సర్కార్కు మధ్య తేడా ఏంటో మేం చె ప్తున్నం.. చూపిస్తామన్నారు రాహుల్ గాంధీ.

ఆరు గ్యారంటీలు అమలు

చేసి ప్రజల పాలనను చూపిస్తం. తొలి క్యాబినె ట్ సమావేశంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడతాం. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం ఉంది. ఢిల్లీలో మోదీకి కేసీఆర్ సహక రిస్తరు. తెలంగాణలో కేసీఆర్కు మోదీ సాయం చేస్తరు. రాష్ట్రంలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటరు' అని రాహుల్ గాంధీ ఆరోపించారు.