లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని వర్గాలను బీజేపీ భయపెడుతోందని, కేంద్ర మంత్రులతో పాటు నేతలు కూడా భయపెడుతున్నారని అన్నారు. ట్యాక్స్ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమైతుందని అన్నారు. బీజేపీలో ఒక్కరే ప్రధాని కళలు కంటారని, మిగతావాళ్ళు ప్రధాని కల కనటానికి కూడా భయపడతారని అన్నారు. కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి చంపారని, పద్మవ్యూహం కమలం ఆకారంలో ఉంటుందని అన్నారు. మహాభారతంలో పద్మవ్యూహన్ని ఆరుగురు కంట్రోల్ చేశారని, ఇప్పుడు కూడా పద్మవ్యూహాన్ని ఆరుగురు కంట్రోల్ చేస్తున్నారని అన్నారు.
అంబానీ, అదానీ కోసమే ప్రభుత్వం ఉందని అన్నారు. ఒకవైపు పేపర్ లీక్ మరోవైపు నిరుద్యోగ చక్రబంధంలో దేశం ఉందని అన్నారు. ఇంటర్న్ షిప్ ల వల్ల యువతకు ఒరిగేదేమి లేదని, కాళ్ళు విరగ్గొట్టి మీద బ్లాంకెట్ వేసినట్లుందని అన్నారు. అగ్నివీర్ ల పెన్షన్ కు బడ్జెట్ లో ఒక్క రూపాయి కుడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడ్జెట్లో మధ్యతరగతిని విస్మరించారని, ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు. రైతులు కనీస మద్దతు ధర కావాలని అడుగుతున్నారని, బడ్జెట్లో కనీస మద్దతుధర ప్రస్తావన కూడా లేదని అగ్దరహం వ్యక్తం చేశారు.రాహుల్ ప్రసంగానికి బీజేపీ నేతలు అడ్డుతగలగా, స్పీకర్ ఓం బిర్లా పలు మార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించాలని కోరారు.