తన తల్లి సోనియా గాంధీకి క్యూట్ కుక్క పిల్ల 'నూరీ' అంటే చాలా ఇష్టమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. నూరీని బ్యాక్‌ప్యాక్‌లో పెట్టి సోనియా తన వీపుపై మోస్తూ నవ్వుతూ ఫోజ్ ఇస్తున్న రెండు ఫొటోలను ఆయన శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
" సోనియా గాంధీ ఫేవరెట్ ఎవరో మీకు తెలుసా..? నేను కాదు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా కాదు. మా అమ్మకి ఇష్టమైనది కచ్చితంగా నూరీ మాత్రమే? " అని రాహుల్ గాంధీ తన పోస్ట్‌కు క్యాప్షన్‌గా రాశారు. రాహుల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నూరీతో కలిసి సోనియా దిగిన రెండు ఫొటోలకు ఏకంగా 9 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.