కాంగ్రెస్ను గెలిపించి..రాహుల్ను ప్రధానిని చేయాలి: మంత్రి సీతక్క

కాగజ్ నగర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ని చేయాలన్నారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం.. ప్రజలకోసం పోరాడుతున్నారు.. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని పీఎం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. కాగజ్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణలో మాదిరిగానే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ.. అభివృద్ధి చేసే పార్టీ... కాంగ్రెస్ తరపున ఎవరికీ ఎంపీ సీటు ఇచ్చినా గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారీటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే ఇచ్చి ఎన్నికల హామీలను నిలబెట్టుకుందన్నారు. పేదలకు  ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ. 5లక్షల ఇస్తుందన్నారు. ప్రతి మహిళను కోటీశ్వరురాలు చేయాలనే ఉద్దేశంతో మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు మంత్రి సీతక్క. కాగజ్ నగర్ వెనకబడిన ప్రాంతం.. ఈ ప్రాంతం అభివృద్దికి సీఎం దృష్టి పెట్టారని మంత్రిసీతక్క అన్నారు. అసెంబ్లీలో పోడు భూముల కోసం మాట్లాడాను.. సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి సీతక్క అన్నారు.