టీఆర్ఎస్ పాలనలో వేలాది మంది రైతులు చనిపోవడం విషాదకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండటం సాగు సంక్షోభానికి సంకేతమని అన్నారు. వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కేసీఆర్ మాటల సుడిగుండంలో రైతు విలవిల్లాడుతున్నాడని వాపోయారు. రైతన్నా కాంగ్రెస్ తో నడువు.. ఉరితాళ్లకు ఇక సెలవు.. ఇదే నా భరోసా అని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.
టీఆర్ఎస్ పాలనలో వేలాది రైతులు చనిపోవడం విషాదం అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండటం సాగు...
Posted by Rahul Gandhi on Friday, May 6, 2022