అయోధ్య బీజేపీ సొత్తు కాదు.. అమిత్ షా వర్సెస్ రాహుల్

అయోధ్య బీజేపీ సొత్తు కాదు.. అమిత్ షా వర్సెస్ రాహుల్

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగంతోనే బీజేపీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ.ప్రసంగం ప్రారంభంలో రాహుల్ శివుడి ఫోటో చూపించగా కాసేపు సభలో రాహుల్ గాంధీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా అయోధ్య అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని ఎండగట్టారు రాహుల్. అయోధ్య బీజేపీ సొత్తు కాదని,.. ఇదే అంశాన్ని ప్రజలు ఎన్నికల్లో ప్రూవ్ చేసారని అన్నారు.

అయోధ్యలో ప్రజల్ని మందిరం దగ్గరకు కూడా రానివ్వలేదని మండిపడ్డారు. అయోధ్య ఓపెనింగ్ కి కార్పొరేట్ పెద్దలను మాత్రమే ఆహ్వానించారని అన్నారు.అక్కడ అంబానీ, అదానీలు మాత్రమే ఉన్నారని అన్నారు.  రామజన్మ భూమి బీజేపీకి మాత్రమే సొంతం కాదని ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. మోడీ వారణాసిలో బతికి బయటపడ్డారని అన్నారు. 

హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్సెస్ మాత్రమే కాదని అన్నారు. హిందూ సమాజం అంటే ఒక్క మోడీనే కాదని, సభలో ఉన్నవారు, బయట ఉన్నవారంతా హిందువులే అని అన్నారు.