ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని.. దొరల కోసం కాదని రాహుల్ గాంధీ అన్నారు. మీరు ప్రజా తెలంగాణ కావాలి అని కోరుకున్నారు.. ఇపుడు దొరల తెలంగాణ వచ్చింది.. మీకు ఏ తెలంగాణ కావాలో ఆలోచించుకోండి అని ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు.
మూడో రోజు బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు మధ్య ఉన్న అనుంబంధం దశాబ్దాల నాటిదని.. ప్రజలతో మా పార్టీకి ప్రేమ, అనుబంధం ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఅర్ సర్కార్ మూసి వేసిన చెక్కర ఫాక్టరీతోపాటు.. ఇక్కడున్న మూడు చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామని చెప్పారు.
Also Read :- కుల గణన చేపట్టి... జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం
పసుపుకు మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడూ పార్టీలు ఒక్కటేనన్నారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, మైనింగ్ మాఫియాలతో దోపిడీ సొమ్మంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.