![చివరి నిమిషంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు](https://static.v6velugu.com/uploads/2025/02/rahul-gandhi-telangana-tour-cancelled_fQRXmZ00qW.jpg)
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం (ఫిబ్రవరి 11) సాయంత్రం రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే.. చివరి నిమిషంలో రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Also Read :- ఏపీ కుల సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవా.?
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 11) లోక్ సభలో కీలకమైన బిల్లులపై చర్చ ఉంది. లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఈ బిల్లులపై చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉంది. దీంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ అజెండా ఏంటన్నది ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. వ్యక్తిగత కార్యక్రమం కోసం రాహుల్ వరంగల్‌కు వస్తున్నారని ప్రచారమైతే జరిగింది కానీ దీనిపై కాంగ్రెస్.. రాహుల్ గాంధీ సిబ్బంది స్పష్టత ఇవ్వలేదు.