ఓటు పవర్ ఫుల్.. ఆలోచించి వేయండి

ఢిల్లీ: ఆరో విడుత ఎన్నికల వేళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బాగా లోచించి ఓటు వేయాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ గడిచిన ఐదు విడతల పోలింగ్ లో మీరు అసత్యాలు, మోసాలు, దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు.  ఇవాళ ఆరో విడత పొలింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి ఓటు వేయాలి. యువకులకు 30 లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఏటా లక్ష నగదు సాయం ప్రారంభమవుతుంది. 

రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు పంటల కొనుగోలు అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఉపాధి కూలీలకు రూ. 400 కనీస వేతనం అమలవుతుంది. మీ ఓటు మీ జీవితాలను మార్చేస్తుంది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది.  నేను, అమ్మ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేశాం. మీరు కూడా ఓటు వేయండి. మీరు భారీ సంఖ్యలో బయటికి వచ్చి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోండి.. మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఓటు వేయండి’ అని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.