డొనాల్డ్​ ట్రంప్​పై దాడి ఆందోళనకరం: రాహుల్

న్యూఢిల్లీ: ట్రంప్ పై హత్యాయత్నం జరగడం పట్ల కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై దాడి ఆందోళనకరం.

ఇలాంటి చర్యలను చాలా తీవ్రంగా ఖండించాలి” అని ఆయన ఆదివారం ‘ఎక్స్(ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.