ఐస్​క్రీమ్ పార్లర్​లో రాహుల్..స్వయంగా కోల్డ్ కాఫీ తయారి..వీడియో వైరల్

  • ఢిల్లీలోని కెవెంటర్స్ స్టోర్ను సందర్శించిన కాంగ్రెస్ నేత 
  • స్వయంగా కోల్డ్ కాఫీ తయారీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

న్యూఢిల్లీ:  లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఢిల్లీలోని పటేల్ నగర్ ఏరియాలో ఉన్న కెవెంటర్స్ స్టోర్‌‌(ఐస్‌‌క్రీమ్‌‌ షాప్‌‌)ను సందర్శించారు. స్వయంగా కోల్డ్ కాఫీ తయారు చేసి కస్టమర్లకు అందజేశారు. 

కెవెంటర్స్ స్టోర్‌‌ యాజమాన్యంతో, అందులోని వర్కర్లతో కాసేపు ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. అనంతరం స్టోర్‌‌ను సందర్శించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 " కొత్త తరం, కొత్త మార్కెట్ కోసం కొత్త బ్రాండ్‌‌ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? దీనిపై కెవెంటర్స్ స్టోర్‌‌ యువ వ్యవస్థాపకులు ఇటీవల నాతో కొన్ని విలువైన విషయాలు పంచుకున్నారు. 

ALSO READ : ఉచితాలు కావాలా.. మంచి సౌకర్యాలు కావాలా.. ప్రజలే నిర్ణయించుకోవాలి: అరవింద్ పనగరియా

కెవెంటర్స్ వంటి మంచి వ్యాపారాలే మన ఆర్థిక వృద్ధిని తరతరాలుగా నడిపిస్తున్నాయి. కాబట్టి మనం వారిని ఆదుకోవడానికి, ప్రోత్సహించడానికి మరింత ఎక్కువగా ప్రయత్నించాలి" అని రాహుల్ క్యాప్షన్ ఇచ్చారు. తాము నిలదొక్కుకోవడానికి చాలా కష్ట పడ్డామని వీడియోలో కెవెంటర్స్ ఫౌండర్స్ రాహుల్ కు తెలిపారు.

  మార్కెట్‌‌లో పెద్ద బ్రాండ్‌‌లతో పోటీ పడాల్సి వచ్చిందని వివరించారు. మన దేశంలో బ్యాంకులు బడా వ్యాపారులకు సులువుగా రుణాలు ఇస్తాయి. కానీ చిన్న వ్యాపారులకు మాత్రం డబ్బులు అందడం లేదని రాహుల్ ఆరోపించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.