Rahul Gandhi: కిరాణా షాపులో సేల్స్మెన్గా రాహుల్ గాంధీ..ఢిల్లీ వీధుల్లో సందడి

Rahul Gandhi: కిరాణా షాపులో సేల్స్మెన్గా రాహుల్ గాంధీ..ఢిల్లీ వీధుల్లో సందడి

లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సేల్స్ మెన్ గా మారారు. ఓ కిరాణషాపులో కొన్ని గంటల పాటు పనిచేశారు..కస్టమర్లకు వస్తువులు అమ్మారు. మంగళవారం( డిసెంబర్10)  ఢిల్లీలోని ఓ గల్లీ కిరాణాషాపులో దాదాపు మూడు గంటల పాటు గడిపన రాహుల్ గాంధీ.. కిరాణా షాపుల ఓనర్లు, కస్టమర్ల ఇబ్బందులను తెలుసుకున్నారు.వేగంగా వృద్ది చెందుతున్న క్విక్ కామర్స్ బిజినెస్ కారణంగా వేలాది కిరాణా షాపులు మూతపడుతున్నాయి.. ఇది ఆందోళన కలిగించే విషయం అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేశారు. 

వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్, GST రేట్లు, పెద్దపెద్ద సూపర్ మార్కెట్లు, గుత్తాధిపత్యం వంటి సమస్యలతో చితికిపోతున్న చిన్న చిన్న కిరాణా షాపుల యజమానులను సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ గల్లీ కిరాణాషాపులో పనిచేశారు.. కస్టమర్లకు వస్తువుల అమ్ముతూ.. పెరుగుతున్న ధరలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలను చూశారు. 

చిన్న చిన్న వ్యాపారాలు, వ్యాపారస్తులను రక్షణకు వ్యవస్థ అవసరాన్ని ట్వీట్ లో రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. కిరాణా దుకాణాలు కేవలం వస్తువులను విక్రయించే వ్యాపారమే కాదు.. కస్టమర్లతో భావోద్వేగ,సాంస్కృతిక సంబంధాలను  కలిగి ఉంటుందన్నారు.

‘‘క్విక్ కామర్స్ బిజినెస్ తో వేలాది చిన్న చిన్న కిరాణా దుకాణాలు మూతపడుతున్నాయి. ఈ రంగంలో గుత్తాధిపత్యం నడుస్తోందన్నారు రాహుల్ గాంధీ. ప్రపంచ ట్రెండ్, మారుతున్న ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా ముందుగు సాగుతున్నప్పుడు చిరు వ్యాపారులు నష్టపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో చెప్పారు. సలహాలు, సూచనలు ఇచ్చే ఏవైన అభిప్రాయాలు షేర్ చేయాలని’’ ట్వీట్ లో కోరారు. 

మరోవైపు దుకాణదారులు, కస్టమర్లు  తమ కష్టాలను  రాహుల్ తో పంచుకున్నారు. చిన్న వ్యాపారులు GSTపై అసంతృప్తి వ్యక్తం చేశారు.వ్యాట్ నుంచి నాలుగు రెట్ల పన్ను వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద క్విక్ కామర్స్ సంస్థలతో నష్టపోతున్నామని తెలిపారు. మరోవైపు  కార్మికులు, గిగ్ వర్కర్లు, హౌస్ పెయింటర్లు, కుండల కళాకారులతో కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు.