ఇవాళ(ఫిబ్రవరి 11)న వరంగల్కు రాహుల్ గాంధీ

ఇవాళ(ఫిబ్రవరి 11)న వరంగల్కు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ( ఫిబ్రవరి 11)  హైదరాబాద్ కు రానున్నారు.   ఇవాళ(ఫిబ్రవరి 11) సాయంత్రం 5.30 గంటలకు  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్న  రాహుల్ గాంధీ నేరుగా హెలికాప్టర్ లో హనుమకొండకు  వెళ్లనున్నారు.

  సాయంత్రం 5.30 కి సుప్రభ హోటల్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. రాత్రి 7.30 కి  రైలులో తమిళనాడు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హనుమకొండకు వస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పర ్యటనతో భారీ బద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

ALSO READ | ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి జాతర : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా

వరంగల్ స్థానిక నేతలతో రాహుల్ కాసేపు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీ కులగణన,ఎస్సీ వర్గీకరణపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కులగణనపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న ప్రభుత్వం రాహుల్ కు వివరించనుంది. 

కేంద్రం రైల్వే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో రాహుల్ రైలులో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలను  తెలుసుకోనున్నారు.