అక్టోబర్ 18న కొండగట్టుకు రాహుల్ గాంధీ.. అంజన్న ఆలయంలో పూజలు

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థలను ఫైనల్ చేసే పనిలోఉన్న కాంగ్రెస్ ప్రచారానికి కూడా సిద్దమవుతోంది.  2023 ఆక్టోబర్  18న జగిత్యాల జిల్లాలో  ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పర్యటించనున్నారు.  జగిత్యాల జిల్లా  మల్యాల మండలం లోని  కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేయనున్నారు.  పూజల అనంతరం ప్రచార రథాలను  ప్రారంభించనున్నారు.  కొండగట్టు నుండి ప్రచారరథం(బస్ ) ద్వారా మల్యాల మీదుగా జగిత్యాలకు  చేరుకొనున్నారు రాహుల్ గాంధీ. జిల్లా కేంద్రం లోని కొత్త బస్టాండ్ వద్ద సాయంత్రం రాహుల్ గాంధీ  రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు వచ్చే వారం కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది.