గిగ్​ వర్కర్స్​ పాలసీని సమగ్రంగా మారుస్తం : సీఎం రేవంత్ రెడ్డి

  • రాహుల్​గాంధీ లేఖపై సీఎం రేవంత్​ ట్వీట్​

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వేతో తమను గర్వించేలా చేయడం మరింత శక్తినిస్తుందంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పనితీరు బాగుందని కితాబునిచ్చారు.

గిగ్ వర్కర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ‘‘రాహుల్ మీ ముందు చూపు, ఆలోచనలు, పని నుంచే మేం ప్రేరణ పొందాం. మీ వాగ్దానాలకు అనుగుణంగా తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా, మార్గదర్శకంగా మారు స్తం” అని రేవంత్ పేర్కొన్నారు.