ఆఫ్షోర్స్ మైనింగ్ ప్రమాదకరం,అనుమతివ్వొద్దు.. ప్రధాని మోదీకి రాహుల్ లేఖ

ఆఫ్షోర్స్ మైనింగ్ ప్రమాదకరం,అనుమతివ్వొద్దు.. ప్రధాని మోదీకి రాహుల్ లేఖ

ఆఫ్షోర్ మైనింగ్ అనుమతిపై లోక సభా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ రాహుల్గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తీరం వెంబడి ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధి, జీవన విధానంపై ప్రభావం చూపుతుందని రాహుల్ అన్నారు.

పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండా ఆఫ్షోర్ మైనింగ్కు టెండర్లు వేసిన తీరుపై తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మత్స్యకారుల ఉపాధిని దెబ్బకొట్టడమే అన్నారు. ఆఫ్ షోర్ మైనింగ్ వల్ల సముద్ర జీవులకు ముప్పు వాటిల్లుతుందున్నారు. పగడపు దిబ్బలకు తీవ్రనష్టం, చేపల నిల్వ కూడా తగ్గుదల వంటి ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొవాల్సిఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు రాహుల్.  

ఈ క్రమంలో 13 ఆఫ్ షోర్ బ్లాకులకు లైసెన్స్ మంజూరుకు గనుల శాఖ టెండర్లు పిలవడం ఏకపక్ష చర్య అని రాహుల్ అన్నారు. దీనిపై మత్య్సకారులనుంచి ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 13 బ్లాక్‌లలో కొల్లాం తీరంలో మైనింగ్ నిర్మాణ ఇసుక కోసం మూడు బ్లాక్‌లు చేపల పెంపకం, ఆవాసాలు ఉన్నాయి. గ్రేట్ నికోబార్ దీవుల తీరంలో పాలీమెటాలిక్ నోడ్యూల్స్ కోసం మూడు బ్లాక్‌లు సముద్ర జీవవైవిధ్య హాట్‌స్పాట్ లుగా ఉన్నాయి. 

ఆ ప్రాంత ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే తీరప్రాంత సమాజంపై దీర్ఘకాలిక సామాజిక ,ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయకుండానే టెండర్లు పిలిచారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.