పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టండి.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..

పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టండి.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..

పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఉభయ సభలలో ఉగ్రదాడిపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని లేఖలో కోరారు రాహుల్ గాంధీ. ఈ ఘటనపై భారతీయులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.  ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

పార్లమెంట్ ఉభయ సభలలో ప్రజా ప్రతినిధులంతా ఒక్కటిగా నిలబడి ప్రజలకు సందేశం ఇవ్వాలని ప్రతిపక్షం బలంగా నమ్ముతోందని.. ఇందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అన్నారు రాహుల్ గాంధీ. ఇదే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్ ఉభయసభలలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని లేఖలో కోరారు ఖర్గే.

పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. ఈ సమావేశంలో ఉగ్రదాడి బాధితులకు సానుభూతి తెలిపిన ప్రభుత్వం.. దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో కేంద్రం తీసుకోబోయే దౌత్యపరమైన చర్యలకు కట్టుబడి ఉంటామని తెలిపింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం.