అండగా మేమున్నాం..EY ఉద్యోగి పేరెంట్స్కు రాహుల్గాంధీ హామీ

అండగా మేమున్నాం..EY ఉద్యోగి పేరెంట్స్కు రాహుల్గాంధీ హామీ

న్యూఢిల్లీ: పని ఒత్తడి కారణంగా మృతిచెందిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ మరణం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. శనివారం ( సెప్టెంబర్ 21) సెబాస్టియన్ పేరెంట్స్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. 

లక్షలాది మంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పని ఒత్తిడితో సతమతమతున్నారు.. పని ప్రదేశాల్లో వారికి పీస్ ఫుల్ ఎన్విరాన్ మెంట్ కోరుకుంటున్నారు..ప్రతిపక్ష నేతగా మేం వారికోసం పోరాడుతామని హామీ ఇచ్చారు.    

కొచ్చిలోని అన్నా సెబాస్టియన్ ఇంటికి వెళ్లిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ( AIPC) చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఏర్పాటు చేసిన వీడియో కాల్ ద్వారా ఆమె తల్లిదండ్రులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. 

ALSO READ | సీనియర్​ నేత ఖర్గేను అవమానిస్తరా.. ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్​

అన్నా సెబాస్టియన్ ఆకస్మిక, విషాదకరమైన మరణం పట్ల ఆయన సానుభూతి తెలిపారు. అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆన్నా సెబాస్టియన్ జ్ణాపకంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఒక అవగాహన ఉద్యమాన్ని రూపొందించాలని AIPC చైర్మన్ కు సూచించారు.

 పని ఒత్తిడి, విషపూరితమైన పని సంస్కృతిని వంటి సమస్యలను గురించి కార్పొరేట్ నిపుణులనుంచి అభిప్రాయాలను తీసుకునేందుకు హెల్ప లైన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు AIPC తెలిపింది.