
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఏపీలోకి ప్రవేశించింది. ఇవాల్టి నుంచి రాహుల్ ఏపీలో జోడో యాత్ర చేయనున్నారు . కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చేత్రగుడి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఏపీలో జోడో యాత్ర కొనసాగనుంది. తిరిగి 22న మళ్లీ కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ జోడో యాత్ర చేయనున్నారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 96% ఓటింగ్ నమోదైందని పార్టీకి చెందిన సెంట్రల్ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్ర్తీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 9,900 మంది డెలిగేట్లలో 9,500 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు తమ ఓటు హక్కును కర్నాటకలో వినియోగించుకున్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న డెలిగేట్ల కోసం బళ్లారి జిల్లా సంగనకల్లులో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మరో 40 మంది డెలిగేట్లతో కలిసి రాహుల్ గాంధీ ఓటేశారు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులోని పార్టీ ఆఫీస్లో ఓటేశారు.